కలెక్టర్ పై కుట్ర పూరితంగా హత్య యత్నం చేశారు : శ్రీనివాస రెడ్డి

-

గత పదేళ్లు బరితెగించిన ప్రభుత్వాన్ని చూశాం.. ఇప్పుడు బరితెగించిన ప్రతిపక్షం నీ చూస్తున్నాం అని MLA యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. BRS వాళ్ళది క్రిమినల్ మైండ్. ఆ క్రిమినల్ మైండ్ తో రాజకీయాలు చేస్తున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఎంత ప్రమాదమో.. తెలంగాణకి BRS నాయకులు కూడా అంతే ప్రమాదం. KTR ఢిల్లీకి వెళ్లి కేసుల నుండి బయట పడేందుకు రెండు రోజులు అక్కడే ఉన్నాడు.

గతంలో BRS ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తాం అంటే మేము శాంతియుత నిరసన చేసినం. కానీ BRS కలక్టర్ మీద హత్యాయత్నం చేసే కుట్ర ఎందుకు చేస్తుంది. కుట్ర పూరితంగా హత్య యత్నం చేశారు. దీనికి ప్రధాన సూత్రధారి కేటీఆర్. కాశ్మీర్ ఉగ్రవాదుల కంటే ఎక్కువ చేస్తున్నారు BRS నేతలు. గతంలో మల్లన్న సాగర్ లో రైతులను బయటకు రానిచ్చారా అని ప్రశ్నించిన శ్రీనివాస రెడ్డి.. ప్రతిపక్షాల ను ఇంట్లో నుండి కూడా బయటకు రానివ్వలేదు. కేటీఆర్ ఎక్కడికి పోతే అక్కడ ప్రతిపక్షాలను హౌజ్ అరెస్టు చేశారు అని శ్రీనివాస రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news