ప్రజలకు ఇష్టం లేకుండా బలవంతంగా ఉద్యమాలు నడవవు : ఎంపీ ఈటల రాజేందర్

-

ప్రజలకు ఇష్టం లేకుండా బలవంతంగా ఉద్యమాలు నడవవు అని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా మీద, మూసీ మీద మాట్లాడిన వాళ్లకు రూ.5 వేలు ఇచ్చి మాట్లాడించారని స్టేట్మెంట్ ఇచ్చారు.  అదే నిజమైతే రేవంత్ రెడ్డి హైడ్రా మీద, మూసీ మీద ఎందుకు తోక ముడిచావో చెప్పాలన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వాళ్లు లగచర్లకు వెళ్లి భూములు కాపాడేందుకు వెళ్లారనుకుందాం.

Etela
Etela Rajendar

ఇప్పుడు వీళ్లు కాదు.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే అక్కడి రైతులు డీ.కే.అరుణను తీసుకుపోయారు. ఎంపీ గారు కాళ్లు మొక్కుతాం.. దండం పెడతాం. మా భూములు పోకుండా కాపాడమని అప్పుడు చెప్పిర్రు అని తెలిపారు. అక్కడ బీజేపీ లేదు.. మాకు తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ వాల్లే స్వచ్ఛందంగా వచ్చారు. ప్రజలకు ఇష్టం లేకుండా బలవంతంగా అసలు ఉద్యమాలు నడుస్తాయా..? అన్నారు. బలవంతంగా వచ్చి ఎవ్వరూ స్టేట్ మెంట్ ఇవ్వరు. అది నిజమే అయితే నువ్వు ఎందుకు తోక ముడిచావో చెప్పాలో అని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news