నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. డాక్టర్, విద్యార్థులు సస్పెండ్

-

తెలంగాణలో ఈ మధ్య కాలంలో ర్యాగింగ్ లు చాలా ఎక్కువ అవుతున్నాయి. నిన్న మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో 10 మంది సీనియర్ విద్యార్థులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. నల్లగొండ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిలను ర్యాగింగ్ చేశారని ముగ్గురు వైద్య విద్యార్థులను, ఒక జూనియర్ డాక్టర్ను సస్పెండ్ చేసినట్టు తెలిసింది. అందులో రెండవ సంవత్సరం విద్యార్థిని ఒక నెల, ఇద్దరు నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్ను మూడు నెలలు సస్పెండ్ చేసినట్లు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి.

చాలా కాలంగా మెడికల్ కాలేజీలో విద్యార్థినిల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ కాలేజీ అధ్యాపక బృందం గుర్తించడంలో విఫలమైనట్లు సమాచారం. కొన్ని సంవత్సరాల తర్వాత నల్లగొండ జిల్లాలో ర్యాగింగ్ పేరు మొదటిసారిగా వినబడింది. ఇప్పటికైనా కాలేజీలలో ఇలాంటి వేధింపులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news