పచ్చి కూరగాయలను తినడం ఆరోగ్యకరమని, వాటిలోని పోషకాలు డైరెక్ట్ గా శరీరానికి అందుతాయని కొంతమంది భావిస్తారు. కొన్ని కూరగాయల విషయంలో అది నిజమే కానీ అన్ని రకాల కూరగాయలను పచ్చిగా తినడం సురక్షితం కాదు.
కొన్ని రకాల కూరగాయల్లో శరీరానికి హాని చేసే పదార్థాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిని పచ్చిగా తినడం వల్ల కడుపుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే వాటిని కచ్చితంగా వండిన తర్వాత మాత్రమే తినాలి.
ప్రస్తుతం ఎలాంటి కూరగాయలను పచ్చిగా తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
పుట్టగొడుగులు:
కొన్ని రకాల పుట్టగొడుగులను పచ్చిగా ఉన్నప్పుడు తినకూడదు. బటన్ మష్రూమ్స్ వంటి రకాన్ని పచ్చిగా ఉన్నప్పుడు తిన్నా ఏమీ కాదు. అవి కాకుండా కొన్ని రకాల పుట్టగొడుగులను పచ్చిగా తింటే వాంతులు, వికారం వంటివి కలిగే అవకాశం ఉంది.
బంగాళదుంపలు:
ఇందులో ఉండే సోలనైన్ అనే పదార్థం వలన వికారం, వాంతులు కలుగుతాయి. అందువల్ల బంగాళదుంపలను కచ్చితంగా వండుకుని మాత్రమే తినాలి.
సొరకాయ:
దీన్ని కూరగా వండుతారు, అలాగే సూప్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు. దీన్ని పచ్చిగా తింటే జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కచ్చితంగా వండుకుని తినటమే మంచిది.
చిక్కుళ్ళు:
కిడ్నీ బీన్స్ లో లెక్టిన్ అనే ప్రోటీన్ రకం ఉండడం వల్ల వికారం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల దీన్ని వండుకుని మాత్రమే తినాలి.
కాలీఫ్లవర్, క్యాబేజీ:
ఈ రెండింటిలో సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది. పచ్చిగా ఉన్నప్పుడు వీటిని అస్సలు తినకూడదు. మరో విషయం ఏంటంటే.. వీటిని పచ్చిగా తిన్నప్పుడు జీర్ణమవడం కష్టం అవుతుంది. అందుకని కచ్చితంగా వండుకుని మాత్రమే తినాలి.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.