శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగ్గా అందితేనే అది సక్రమంగా పనిచేస్తుంది. సరిగ్గా అందకపోతే శరీరంలో లోపాలు కనిపిస్తాయి. ప్రస్తుతం మనం విటమిన్ డి లోపం గురించి మాట్లాడుకుందాం. ఎముకలను బలంగా ఉంచడంలో విటమిన్ డి సహాయపడుతుంది.
విటమిన్ డి లోపం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తరచుగా జ్వరాలు రావడం:
విటమిన్ డి లోపం కారణంగా జ్వరాలు తరచుగా వస్తుంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాదు.. శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు, జలుబు, నిమోనియా వంటివి విటమిన్ డి లోపం వల్ల కలిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.
తీవ్రమైన అలసట:
అసలు ఏమి చేయకపోయినా కూడా అలసటగా అనిపిస్తుంటే విటమిన్ డి లోపం కావచ్చు. ఇలాంటి పరిస్థితి కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిది.
నడుము నొప్పి:
ఎముకలను దృఢంగా ఉంచడంలో విటమిన్ డి సహాయపడుతుందని ఇంతకుముందు తెలుసుకున్నాం. అంటే విటమిన్ డి లోపించడం వల్ల ఎముకలు బలహీనంగా మారిపోయే అవకాశం ఉంది. ఈ కారణంగా ఎముకల నొప్పితో పాటు నడుము నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది.
డిప్రెషన్:
తీవ్రమైన అలసట కారణంగా ఏ పని మీద ఫోకస్ ఉండదు. దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
వెంట్రుకలు రాలిపోవడం, కండరాల నొప్పి:
ముఖ్యంగా పెద్దల్లో విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలిపోయే సమస్య అధికమవుతుందని అంటున్నారు. ఎముకలు నొప్పితో పాటు కండరాలు కూడా నొప్పి పెడతాయట.
అంతేకాదు.. విటమిన్-డి లోపం శరీర బరువును పెంచుతుంది, ముఖ్యంగా పొట్ట అమాంతం పెరిగిపోయి అనేక సమస్యలను సృష్టిస్తుంది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.