ఏపీలో నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్..!

-

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతూనే ఉంది. ఇది రానున్న 6 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉన్నట్లు పేర్కొంది.

బంగాళాఖాతం లోని ఈ వాయుగుండం రేపు మధ్యాహ్ననికి పుదుచ్చేరి వద్ద తుఫాను గా మారి తీరాన్ని తాకనుంది. ఇక రెండు రోజులపాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. దీంతో దక్షిణ కోస్తా పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక.. రాష్ట్రంలో మిగతా పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news