సీఎం రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఆగ్రహం..!

-

సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైంది. ఈ సర్కారు ఉత్త బేకారు ఉన్నదని ప్రజలు అనుకుంటున్నరు. ఎవరు మెచ్చుకునే పరిస్థితి లేదు గనుక, ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నడు. మాది సుపరిపాలన అని డబ్బా కొట్టుకుంటున్నడు. నీది సుపరిపాలన అని ప్రజలు చెప్పాలె. నువ్వు కాదు రేవంత్ రెడ్డి. మేము మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే, నీ రాక తర్వాత ఆశించిన మేరకు ఆర్థిక వృద్ధి రేటు పెరగలేదు. వృద్ధి రేటు పెంచే సత్తా లేదు, సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికి వచ్చినట్లు వాగుతున్నావు. నెపం ప్రతిపక్షం మీదకు నెట్టుతున్నవు.

ఆడరాక మద్దెల ఓడు అనే సామెతకు నీ మాటల్ని మించిన నిదర్శనం లేదు. ఈ ప్రభుత్వానికి ఆదాయం పెంచే సత్తా లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసే చిత్తుశుద్ది లేదు. ప్రజలకు వాస్తవం చెప్పే దమ్ము లేదు. కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే.. ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీశ్రీ కవిత లాగ ఉంది. ఏడు లక్షల కోట్ల అప్పు అని ఏడాది కాలం నుంచి చెప్పిన అబద్దం మళ్లీ మళ్లీ చెబుతున్నవు. అబద్దాలు ప్రచారం చేస్తే గోబెల్స్ ప్రచారం అంటరు. గోబెల్స్ ను మించిన రేబెల్స్ ప్రచారం నీది. గత ప్రభుత్వం దాచిందని అసత్య ప్రచారం చేస్తున్నావు. ప్రభుత్వం అట్ల దాచే అవకాశమే ఉండదు రేవంత్ రెడ్డి. అప్పులు బహిరంగ రహస్యమే. గణాంకాలన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి. ప్రతీ ఏటా అసెంబ్లీలో ప్రవేశపెట్టే కాగ్ నివేదికల్లో ఉంటాయి అని హరీష్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news