రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీష్ రావు..!

-

రైతు బంధును ఎవరు ఎగ్గొట్టారో ప్రజలకు తెల్వదా ప్రజల విజ్నత మీద నీకు చాలా తక్కువ అభిప్రాయం ఉంది. మోసం చేసుడు నీకలవాటు, మోస పోవుడు ప్రజలకు అలవాటు అనే కదా నీ నమ్మకం అని రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. గత ఎన్నికలకు ముందు రైతు బంధు కోసం 7,200 కోట్ల నిధులు సిద్ధం చేసి రైతుల ఖాతాల్లో వేసేందుకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకున్నాం. రైతు బంధు ఖాతాల్లో పడితే నీకు ఓట్లు డబ్బాలో పడవని భయమై, దుర్మార్గంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు ఆపింది నువ్వు. ఇప్పుడైతే 10వేలు, మేమొస్తే 15వేలు అని రైతులను ఊరించి, నమ్మించి ఓట్లు కొల్లగొట్టిన ఘరానా మోసగాడివి నువ్వు.

ఏ ఛానల్ వేదికగా కూర్చుందాం, ఏ ఆర్థిక నిపుణులతో కూర్చుందామో చెప్పు. తప్పించుకోకు. పార్లమెంట్ ఎన్నికల ముందు మేము నిలదీస్తే విధిలేక మేము సిద్ధం చేసిన నిధులతో రైతుల ఖాతాల్లో 5వేలే వేసినవు. 7500 ఎందుకు వేయలేదు. నిజాయతీ ఉంటే సమాధానం చెప్పు. మొన్న వానాకాలం పూర్తిగ ఎగ్గొట్టిన్నవు. రైతు బంధును ఆపింది నువ్వు, లేని ఆశలు రేపింది నువ్వు, తీరా అధికారంలోకి వచ్చి ఎగవేసింది నువ్వు. ఎగ్గొట్టింది మేమా నువ్వా.. అందుకే ప్రజలు అనుకుంటున్నారు. అబద్దానికి అంగీ లాగు వేస్తే అచ్చం రేవంత్ రెడ్డి లెక్కనే ఉంటదని. వరుసగా రెండు సంవత్సరాలు కరోనా వచ్చి రాష్ట్ర పరిస్థితి అతలాకుతలం అయిపోయినా కేసీఆర్ రైతు బంధును ఆపలేదు. మా హయాంలో మొత్తం 11 విడతల్లో 72,815 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసిన రైతు బాంధవుడు కేసీఆర్. ఆరు నూరైనా రైతు బంధు ఆపని కేసీఆర్ ఎక్కడా, ఏడాదిలోనే చేతులెత్తేసిన నువ్వెక్కడ అని హరీష్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news