ఇళ్లు లేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లబ్ధిదారుల వివరాలను నమోదు చేసేందుకు బిల్డ్ నౌ యాప్ ను తీసుకొచ్చింది. దీనిని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా లబ్దిదారులు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది. త్వరలోనే పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది.
తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఇళ్లు లేని పేద ప్రజలకు ఇళ్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ హామిపై సమీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. లబ్దిదారులను గుర్తించే పనిలో పడింది. ఈ క్రమంలో.. లబ్ధిదారులు వివరాలు నమోదు చేసేందుకు గాను బిల్డ్ నౌ యాప్ ను తయారు చేయింది.