తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుంది : తీన్మార్ మల్లన్న

-

తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుంది అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. మహారాష్ట్ర సదన్ లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ 3వ జాతీయ సదస్సులో తెలంగాణ నుంచి పాల్గొన్న తీన్మార్ మల్లన్న కీలక కామెంట్స్ చేసారు. దేశంలో ఓబీసీలు,మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు,పరిష్కార మార్గాలపై ఓబీసీ జాతీయ సదస్సులో చర్చించాం స్వాతంత్య్రం వచ్చాక 1952 నుంచి తెలంగాణ నుంచి 1733 మంది అసెంబ్లీకి వెళ్తే అందులో 8 మంది మాత్రమే ఓబీసీ మహిళలు ఉన్నారు. 95 మంది ఉంటావర్గాల మహిళలు ఉన్నారు.

ముద్ర లోన్ల విషయంలో ఓబీసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. జనాభాలో ఎవరివాటా వారికి దక్కాల్సిందే. 10 వేల ఉద్యోగాలు EWS కోటాలో దోచుకున్నారు. EWS కోటాలో ఉద్యోగాలు అక్రమంగా భర్తీ చేస్తున్నారు. మహిళా బిల్లు వల్ల ఓబీసీలకు న్యాయం జరగదు. ఓబీసీ మహిళలకు మహిళా బిల్లు ద్వారా 33శాతం రిజర్వేషన్లు ప్రత్యేకంగా ప్రత్యేకంగా అమలు చేయాలి అని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news