తెలంగాణలో పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం..!

-

తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. నవంబర్ నెలలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 32.96 కోట్ల ఆదాయం పెరిగింది. గత ఏడాది 2023 నవంబర్ లో 1,05,235 డాక్యుమెంట్ల ద్వారా 1127.79 కోట్ల ఆదాయం వస్తే.. ఈ నవంబర్ నెలలో 1,19,317 డాక్యుమెంట్ల ద్వారా రూ. 1160.75 కోట్ల ఆదాయం సమకూరింది. అప్పటితో పోలిస్తే డాక్యుమెంట్ల సంఖ్య 13.38 శాతం పెరిగింది. ఆదాయం 2.92 శాతం పెరిగింది.

అలాగే హెచ్ఎండీఏ పరిధిలో కూడా సానుకూల వృద్ధి నమోదైంది. ఈ ఒక్క నెలలోనే 625 డాక్యుమెంట్లతో రూ.21.09 కోట్ల ఆదాయ వృద్ధిని సాధించింది. ఇక నాన్ హెచ్‌ఎండీఏ ప్రాంతంలో 3513 డాక్యుమెంట్లతో 202.78 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వాణిజ్య సముదాయాలతో పోలిస్తే గృహాలు, నివాస సముదాయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ఆదాయంలో ఎక్కువ వృద్ధి నమోదైంది అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news