కేంద్రం రూపాయికి బియ్యం పంపిణీ చేస్తే అక్రమ రవాణా ద్వారా చేతులు మారి 40 రూపాయలకు అమ్ముతున్నారు అని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇప్పుడు దీనిపై కాకినాడలో ఇష్యూ జరుగుతోంది. అయితే మీకిచ్చిన బియ్యాన్ని మీరు తినాలి… ఇతరులకు అమ్ముకుంటే ఎలా అని ప్రజలను ప్రశ్నించారు స్పీకర్.
అలాగే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వరకు పార్టీలొద్దు.. అభివృద్దికి అందరూ కలవండి అని పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 8న జరగనున్న నీటి సంఘాల ఎన్నికల్లో గెలవాల్సిన భాద్యత అందరిపై ఉంది. నీటి సంఘాల ఎన్నికల్లో పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తే మా ఇంటి గుమ్మం ఎక్కొద్దు అని హెచ్చరించారు. ఇందులో ఏ సెగ్మెంట్ ఓడిపోయినా.. పైసా మంజూరు చేయం. కానీ మీ నీటి సంఘాల ఎన్నికల్లో గెలిస్తేనే అభివృద్ది పనులు చేస్తాం. ఇక తాండవ ఎత్తిపోతలకు రూ. 2,400కోట్లు మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని అయ్యన్న పాత్రుడు వివరించారు.