తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఫ్లాప్.. ఆలౌట్..!

-

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌కు తొలి సెష‌న్‌లో తొలి బంతికే జ‌ల‌క్ త‌గిలింది. స్టార్క్ వేసిన తొలి బంతికే జైస్వాల్ డ‌కౌట‌య్యాడు. చివరి బంతికి కూడా నితిశ్ ని ఔట్ చేశాడు స్టార్ట్.  జైస్వాల్ త‌ర్వాత గిల్‌, రాహుల్ కొద్ది సేపు మాత్రమే ఆసీస్ స్పీడ్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్నారు. 69 ర‌న్స్ వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది భార‌త్. రాహుల్ 37 ర‌న్స్ చేసి నిష్క్ర‌మించాడు. అయితే ఆ త‌ర్వాత కోహ్లీ, గిల్ కూడా వెంట‌ వెంట‌నే పెవిలియ‌న్ చేరుకున్నారు. గిల్ 31 ర‌న్స్ చేయ‌గా, కోహ్లీ ఏడు ప‌రుగుల‌కే ఔట‌య్యారు.

భారత బ్యాటర్లలో ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు.  ఆ తరువాత కే.ఎల్.రాహుల్ 37, గిల్ 31, అశ్విన్ 22, పంత్ 21, కోహ్లీ 07, సిరాజ్ 04, రోహిత్ 03 రన్స్ చేశారు. జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు తీసి టీమిండియా పతనానికి పునాదులు వేశారు. బొలాండ్ 02, కమిన్స్ 02 వికెట్లు తీశారు. భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులు చేసింది భారత్.

Read more RELATED
Recommended to you

Latest news