వేములవాడ కోడెల అక్రమ విక్రయం.. కొండా సురేఖ క్లారిటీ..!

-

వేములవాడ దేవస్థానంలోని కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా కొండా సురేఖ తేల్చి చెప్పారు. ప్రభుత్వం పై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా ప్రచారమవుతున్న తప్పుడు వార్తలను మంత్రి సురేఖ ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కోడెల సంఖ్య పెరుగుతుండటంతో కోడెల నిర్వహణ భారంగా మారి చాలా కోడెలు మరణించిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భక్తుల విన్నపాల మేరకు మొక్కుల రూపంలో భక్తులు సమర్పించిన కోడెల నిర్వహణ నిమిత్తం విధివిధానాలను రూపొందించేందుకు ఆరు నెలల క్రితం మేలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్ గా, పలువురు ఇతర సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటి మార్గదర్శకాలను రూపొందించినట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ మేరకు జీవో విడుదల చేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు.

ఈ మార్గదర్శకాల ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, సంబంధిత మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ధ్రువీకరణ పత్రం వుంటేనే పంపిణీ చేస్తున్నట్లు మంత్రి సురేఖ గుర్తు చేశారు. ధ్రువీకరణ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా వుంటేనే ఒక రైతుకు రెండు కోడెల చొప్పున మాత్రమే ఇస్తున్న విషయాన్ని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోడెల సంరక్షణ కోసం గోశాలలో సిసి ఫ్లోరింగ్, సరిపడా షెడ్లు, తాగునీటి వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సురేఖ వివరించారు. మూగజీవాల పై తమ ప్రభుత్వానికున్న శ్రధ్ధ అటువంటిది మంత్రి అన్నారు. ఎంతో నిబద్ధతతో గోశాలల నిర్వహణ, గోవుల సంరక్షణను చేపడుతున్న పరిస్థితుల్లో కోడెలను అక్రమంగా విక్రయించారని వచ్చిన వార్తలు వట్టి పుకార్లను మంత్రి సురేఖ కొట్టి పారేశారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని అవాస్తవ ప్రచారం చేస్తూ, సమాజంలో అశాంతిని సృష్టించే అసాంఘిక శక్తులను వెలికితీసి, చట్టపరంగా చర్యలు చేపడతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news