ఏపీలో లక్ష మంది ఉర్జావీర్ లను సిద్ధం చేయాలని టార్గెట్ అని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇప్పటి వరకూ 12 వేల మంది ఉర్జావీర్ లుగా రిజిష్టర్ చేసుకున్నారని తెలిసింది. పర్యావరణ పరిరక్షణ కు కూడా విద్యుత్ పొదుపు చేయడం అవసరం. ఎనర్జీ ఎఫిషియన్సీ లో ఏపీ లీడర్. సీఎం చంద్రబాబు విధానాలతో మేం ప్రేరణ పొందాం.
ఉర్జావీర్ అనే కార్యక్రమం అనగానే కచ్చితంగా చూడాలని వచ్చాను. విద్యుత్ ను పొదుపు చేసుకోవడం చాలా అవసరం. ప్రతి మనిషికి పొదుపు చాలా అవసరమైన అంశం. మన అవసరాలు, మన డిమాండ్లు పెరుగుతున్నాయి. 2047 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి. విద్యుత్ వినియోగం తగ్గిస్తూనే అవసరాలు తీర్చుకోవడం ఎలా అనేది ప్రజలు తెలుసుకోవాలి. అయితే ఈ ఉర్జావీర్ అనేది ఒక రకమైన ఉద్యోగం కూడా అని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ తెలిపారు.