తెలంగాణ వాస్తవ చరిత్రను మరుగున పెట్టే ప్రయత్నం చేశారని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం పై చర్చ జరిగింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ రాకపోయేదని.. డిసెంబర్ 09న తెలంగాణ ఏర్పాటు ప్రకటించిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చిహ్నం పై చర్చ జరుగుతుందని.. తెలంగాణకు అధికారిక గేయం లేదని గుర్తించి తెలంగాణ సెంటిమెంట్ కి అనుగుణంగా మా ప్రభుత్వం రాగానే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ఏర్పాటు చేశామని తెలిపారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ అధికారంలో లేదని.. ఇప్పటివరకు ఉన్నది ఒక పార్టీకి మాత్రమే సంబంధించినది తప్ప రాష్ట్ర అధికారిక విగ్రహం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఇవాళ ఆవిష్కరించుకుంటున్నామని తెలిపారు. తెలంగాణకు స్ఫూర్తి దాయకంగా ఉండాలని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసుకుంటున్నామని చెప్పారు. విగ్రహ నమూనా పై రాజకీయం చేసే బీఆర్ఎస్ నాయకులు పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.