శ్రీశైలం జలాశయ నీటి వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతాం అని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కలెక్టరేట్ లో డి.డి.ఆర్.సి. నీటి పారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు మంత్రి. అయితే గతంలో ఒకే రాష్ట్రం ఉన్నపుడు నీటి వాడకంపై ఎలాంటి ఇబ్బందులు లేవు అని పేర్కొన ఆయన.. ఇప్పుడు శ్రీశైలం జలాశయాలను రెండు రాష్ట్రాలవారు ఎవరికి వారే వాడితే నష్టపోయేది రైతులే అని వారించారు.
కాబట్టి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలను తెలుసుకుని నిర్ణయం తీసుకుంటాం అన్నారు. అలాగే రెండో పంటగా ఆరుతడి పంటలే బెస్ట్ స్ని సూచించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేసింది. కానీ మేము ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం అని వివరించారు. అయితేమంత్రి పయ్యావుల కేశవ్ ఇర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు జనార్దన్ రెడ్డి , ఫరూక్ ,ఎమ్మెల్యేలు గౌరు చరిత , అఖిల ప్రియ , బుడ్డా రాజశేఖర రెడ్డి , జయసూర్య , సూర్యప్రకాష్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు.