ఆశా వర్కర్లతో రాజకీయం.. ప్రతిపక్ష దిగజారుడు తనానికి నిదర్శనం : రాజనర్సింహ

-

ఆశా వర్కర్ లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు జరుగుతుంటే తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆశా వర్కర్లను రెచ్చగొట్టారని విమర్శించారు. గత పదేళ్ళు పాలనలో ఆశా వర్కర్ ల వేతనాల పెంపు పై ఎన్నిసార్లు నిరసనలు, ధర్నాలు చేసిన పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూన్నారు. ఇది వారి ద్వంద వైఖరి కీ నిదర్శనమన్నారు.

2015 లో 106 రోజులు వేతనాలు పెంచాలని ధర్నా చేసిన ఆశా వర్కర్ లను గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. 2018, 2020, 2021, 2023 సంవత్సరాల లో ఆశా వర్కర్ లు సమ్మెలు, ధర్నా లు చేశారని మంత్రి దామోదర్ రాజనర్సింహ గుర్తు చేశారు. అప్పుడు ఆశా వర్కర్ ల సమస్యలను పరిష్కరించలేని వాళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. ఆశా వర్కర్ లు సంయమనం తో వ్యవహరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రేరేపిత ధర్నా, నిరసనలు తెలిపే వారి ఉచ్చు లో పడొద్దన్నారు. ప్రజా ప్రభుత్వం ఆశా వర్కర్ ల స్వేచ్ఛను గౌరవిస్తుందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. శాంతి భద్రతలకు భంగం కలిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఆశా వర్కర్ ల నిరసనలో సొమ్ముసిల్లి పడిపోయిన ఆశా వర్కర్ రహీం బీ కీ ఉస్మానియా ఆస్పత్రి లో మెరుగైన చికిత్స ను అందించాల్సిందిగా ఆసుపత్రి సూపరిoటెండెంట్ ను మంత్రి దామోదర్ రాజనర్సింహ అదేశించారు

Read more RELATED
Recommended to you

Latest news