రాజధానిని తరలించవద్దంటూ అమరావతి ప్రాంత మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు నెల రోజులు దాటిపోయాయి. మరోవైపు, ఈ నిరసనలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా రాజధాని రైతులపై, మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నాయకురాలు దివ్యవాణి ఫైర్ అయ్యారు. రాజధానిలో అమరావతి కోసం పోరాటం చేస్తుంది రైతులు కాదని ఆడంగి వెధవల్లా మహిళలను ముందుకు నెట్టి వెనక దాక్కుంటున్నారా? అని ,రాజధాని రైతులు మగాళ్ళు కాదా .. వాళ్లకు దమ్ము లేదా అని రోజా చేసిన వ్యాఖలకు దివ్యవాణి ఘాటుగా సమాధానం ఇచ్చారు.
మగతనాల గురించి మాట్లాడవద్దని రోజాకు హితవు పలికారు. తాము కూడా నీలా మాట్లాడగలమని… అయితే, తమకు సంస్కారం ఉందని చెప్పారు. మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రోజా మాట్లాడే ముందు తన చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు.జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తల్లి, చెల్లి రోడ్ల మీద తిరిగి ప్రచారం చేయలేదా? వాళ్లు మహిళలు అన్న విషయం రోజాకు తెలియదా? అని ప్రశ్నించారు.