కొడాలి నాని, వల్లభనేని వంశీల ఆచూకి చెప్తే బహుమానం ఇస్తాం : బుద్దా వెంకన్న

-

చంద్రబాబు సీఎం అయిన తర్వాత అడ్రస్ లేకుండా పోయినా కొడాలి నాని, వల్లభనేని వంశీల ఆచూకి తెలియ చేస్తే 1,116 బహుమానం ఇస్తాం అని బుద్దా వెంకన్న ప్రకటించారు. వారి ఆచూకీ తెలిసి, పోలీసులకు అప్పగిస్తే.. తప్పకుండా బహుమానం ఉంటుంది. జగన్ విధానాలు, పోకడనలు నచ్చక అనేక మంది వైసీపీని వీడి బయటకు వస్తున్నారు. వైసీపీ త్వరలో పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయం. తన పని అయిపోయిందని భావించిన జగన్.. బెంగుళూరుకు పూర్తిగా మకాం మార్చాలని చుస్తున్నారు.

జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షలాది మందిని ఇబ్బందులు పెట్టారు. అయినా చంద్రబాబుకు అండగా నిలబడి.. ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. నేను దమ్ముగా నిలబడ్డా… ప్రజల పక్షాన పోరాటం చేస్తూ.. పార్టీకోసం, చంద్రబాబుకోసం పని చేశాను. అధికారం కోల్పోగానే మీలాగా పారిపోయి మేము దాక్కోలేదు. చంద్రబాబు గతంలో ఓటమి చెందినా.. ప్రజల కోసం నిలబడ్డారు. ఒక్క ఓటమితోనే జగన్, తో పాటు, ఆరోజు నోరు పారేసుకున్న వారంతా తోక ముడిచారు. మీకు అధికారం, పదవులు ఉంటే.. రంకెలు వేస్తారా. పదవులు పోగానే.. ప్రజలను పట్టించుకోకుండా పారిపోతారా. చంద్రబాబు కుటుంబాన్ని అవమానించిన రోజే వైసీపీ పతనం ఖాయం అని వారి పార్టీ నేతలే చెప్పారు. కొడాలి నాని విర్రవీగిన రోజే వైసీపీ పని అయ్యిందని చెప్పారు. ఇటువంటివి జగన్ పట్టించుకోకుండా నియంతలా వ్యవహరించారు. జగన్ చేసిన పాపాలకు.. ప్రజలు తగిన బుద్ది చెప్పారు అని బుద్దా వెంకన్న అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news