మలబద్దకంతో ఇబ్బందా..? పోగొట్టేందుకు పనికొచ్చే చిట్కాలు మీ కోసమే.

-

వయసులతో సంబంధం లేకుండా యువత నుండి పెద్దవాళ్ల వరకు ఎంతోమంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. ఉదయాన్నే సరిగ్గా కడుపు ఖాళీ అవ్వక అవస్థలు పడుతున్నారు.

ఈ సమస్య నుండి విముక్తి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మలబద్ధకం సమస్య దూరం అవ్వాలంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

పెద్దవాళ్లు ఒక రోజులో కనీసం 25 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ ని తక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య అధికమవుతుంది.

ఫైబర్ కలిగిన ఆహారాలు చాలా ఉంటాయి. వాటిల్లో మీరు ఏది ఎంచుకుంటారనేది ముఖ్యం అవుతుంది. మలబద్ధకం సమస్య తీవ్రంగా ఉంటే.. ఫైబర్ కలిగిన పండ్లతో జ్యూస్ చేసుకుని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి?

ఆపిల్, బెర్రీస్, అవకాడో, పాలకూర, చియా విత్తనాలు తీసుకోవాలి.
వీటిని సమపాళ్లలో తీసుకుని ఒక కప్పు నీళ్లు కలిపి గ్రైండ్ చేస్తే జ్యూస్ తయారవుతుంది. దీన్ని ఉదయం పూట తీసుకోవడం వల్ల పేగుల్లో కదలికలు చురుకుగా ఉండి మలబద్ధకం దూరం అవుతుంది.

అలాగే రోజువారి ఆహారంలో కచ్చితంగా ఫైబర్ ఫుడ్ ఉండేలా చూసుకోండి. ఇంకా కావాల్సిన నీళ్లు తాగడం మర్చిపోవద్దు. టైం కి తినాలి. ఇవన్నీ పాటిస్తే మలబద్ధకం సమస్య నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news