ఇండియాలో క్రికెట్ అన్నా సినిమా అన్నా జనాల్లో ఆదరణ చాలా ఎక్కువ. ఈ కారణంగానే క్రికెటర్లకు, సినిమా స్టార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్లకు పారితోషకం ఎక్కువ.
రీసెంట్గా పుష్ప రిలీజైన సందర్భంలో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 300 కోట్లు అంటూ పుకార్లు వచ్చాయి. దాని గురించి పక్కన పెడితే.. సెలబ్రిటీలు ఈ సంవత్సరం కట్టిన టాక్స్ ఎంతో తెలుసుకుందాం.
ఈ జాబితాలో షారుక్ ఖాన్ పేరు ముందు వరుసలో ఉంది. 2024సంవత్సరంలో 92 కోట్లు టాక్స్ కట్టారు. ఆ తర్వాత స్థానంలో తలపతి విజయ్ 80 కోట్లతో ఉంటే, సల్మాన్ ఖాన్ 75కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు.
71 కోట్ల టాక్స్ తో అమితాబచ్చన్ 4వ స్థానం, విరాట్ కోహ్లీ 66 కోట్లతో 5వ స్థానంలో.. అజయ్ దేవగన్ 42 కోట్లతో ఆరవ స్థానంలో, ఎమ్మెస్ ధోని 38 కోట్లతో ఏడవ స్థానంలో, రణ్ బీర్ కపూర్ 36కోట్లు, సచిన్ టెండూల్కర్ 28 కోట్లు, హృతిక్ రోషన్ 28 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అల్లు అర్జున్ విషయానికి వస్తే 14 కోట్లతో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకున్నారు.