అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో వాళ్ళ డొల్లతనం బయట పడింది అని పేర్కొన ఆయన.. సీఎం 100 శాతం రుణమాఫీ అయింది అంటే.. వాళ్ళ ఎమ్మెల్యేలే 70 శాతం అని చెప్తున్నారు అని స్పష్టం చేసారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ చేయలేదు.. రైతు బంధు ఇవ్వలేదు అని మేము అడిగితే సీఎం కు కోపం వచ్చింది అని పేర్కొన్నారు కేటీఆర్.
అలాగే కేసీఆర్ గురించి చాలా చిల్లర మాటలు మాట్లాడారు అని సీరియస్ అయిన కేటీఆర్.. ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు అని పేర్కొన్నారు. అలాగే ఎన్ని కేసులు పెట్టినా బయపడం. ఈడీ కి కూడా బయపడం.. మోడీ కి కూడా బయపడం. మా మీద ఎన్ని కేస్ లు పెట్టినా వెనుకడుగు వేయం అని స్పష్టం చేసారు కేటీఆర్.