మహిళల ఎదుగుదల రాష్ట్రానికి, దేశానికీ ఎంతో అవసరం : నారా భువనేశ్వరి

-

నాలుగు రోజుల కుప్పం పర్యాటన లో భాగంగా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి వద్ద మహిళలతో ముఖముకి కార్యక్రమం లో పాల్గొన్నారు నారా భువనేశ్వరి. మహిళల ఎదుగుదల రాష్ట్రానికి, దేశానికీ ఎంతో అవసరం. మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్నివిధాలా సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగ నమ్మే వ్యక్తి చంద్రబాబు. గతంలో డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తాం అని ప్రకటించినపుడు చాలా మంది ఎగతాళి చేసారు. మహిళలకు ఇవన్నీ అవసరమా అని ప్రశ్నించారు.

కానీ ఇప్పుడు అదే మహిళా సంఘాలు దేశంలోనే ఎక్కడ లేనివిధంగా వృద్ధి సాధిస్తున్నాయి. కుప్పం ప్రజలకోసం చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయి. రైతులకోసం దేశంలోనే మొట్టమొదటి సరిగా కుప్పంలో ఇజ్రాయిల్ తరహా వ్యవసయాన్ని పరిచయం చెయ్యడమే కాకుండా వ్యవసయంలో పెద్ద విప్లవమే తెచ్చారు. గత పాలకులు రాష్ట్రాన్ని వందేళ్ల వెనక్కి తీసుకెళ్లారని మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి లోకి తెచ్చేందుకు చంద్రబాబు చాలా శ్రమిస్తున్నారు అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news