నవోదయాల ఏర్పాటుకు స్థలాలు ఇవ్వాలని సీఎంను కోరిన ఎంపీ అరవింద్..!

-

ఇటీవల కేంద్ర కేబినెట్ జగిత్యాల మరియు నిజామాబాద్ జిల్లాలో నవోదయల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో నవోదయల ఏర్పాటుకు ఒక్కోచోట సుమారు 20 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల్లో పలు ప్రతిపాదిత స్థలాలను ఎంపీ, సీఎంకు వివరించారు.

అలాగే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను ఎంపీ అర్వింద్ వివరిస్తూ, మాధవ్ నగర్ ఆర్ఓబి 50-50 పద్ధతిలో మంజూరు చేయబడిందని, అడివి మామిడిపల్లి ఆర్ఓబి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైనప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మళ్ళించిందన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, దీనివల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందన్నారు. ఇవేగాకుండా ఇతర ఆర్వోబీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని, కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసి , పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని కోరారు ఎంపీ అరవింద్.

Read more RELATED
Recommended to you

Latest news