వారికి దూరంగా ఉండాలంటూ అల్లు అర్జున్ ట్వీట్..!

-

గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ వద్దకు బన్నీ వెళ్లిన సమయంలో జరిగిన ఘటన పై నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఫైర్ కావడం.. ఆ తర్వాత రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో ప్రస్తుతం రచ్చ జరుగుతుంది. ఈ క్రమంలో బన్నీ మరో ట్వీట్ చేసారు. నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని విన్నపం.

అయితే ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ID, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా వుండాలని నా ఫ్యాన్స్ కు సూచిస్తున్నాను అని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు అందరూ అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంది పడుతున్న సమయంలో.. ఈ రకమైన ట్విట్ బన్నీ చేయడం మరో రచ్చకు దారితీసేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news