మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి అర్ధంకాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగదీష్ రెడ్డికి, కోమటిరెడ్డికి చాలా తేడా ఉందన్నారు. పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారన్నారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధును ప్రవేశపెట్టి వారిని ఆదుకున్నారన్నారు.
కాళేశ్వరం ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి,కోదాడ నియోజకవర్గాలకు నీళ్లు అందించారని, శాంతిభద్రతల విషయంలో కేసీఆర్ రాజీపడలేదని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఎన్నికల్లో అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చారన్నారు. 6గ్యారెంటీలు, హామీల అమలులో విఫలం అయిందన్నారు. లగచర్లలో గిరిజనులను ఇబ్బంది పెట్టిన విషయాన్నిప్రజలు మర్చిపోరన్నారు. ప్రతి జిల్లాకు కేసీఆర్ మెడికల్ కాలేజీ ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి తెలిపారు.