కూటమి నేతలకు సంక్రాంతి కానుక రెడీ చేశారు బాబు. సంక్రాంతికి మార్కెట్ యార్డ్ కమిటీల నియామకానికి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఏఎంసీ చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వనున్నారట. క్షేత్ర స్థాయిలో 10 వేల పదవులు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. కూటమి నేతలకు కొత్త సంవత్సరం లో గుడ్ న్యూస్ చెప్పే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందని అంటున్నారు.
సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులను జనవరిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నారట. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ దాదాపు 10 వేల పదవులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలోపు వాటికి నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందట. ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఖరారు చేసే బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించి నట్టు సమాచారం అందుతోంది. సంక్రాంతి నాటికి ఈ పదవులు భర్తీ చేయాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని సమాచారం.