ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ పథకాల తీరుపై ఇంచార్జి మంత్రి కొండా సురేఖ వర్చువల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ… ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుంట భూమీ ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయం అని తెలిపారు. కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చ ఏశారు. నియోజకవర్గానికి 3500 ఇండ్లుకు లబ్ధిదారుల ఎంపిక ఎవరు చేస్తారు..? అని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై పూర్తి కాని ఇళ్ళకు కూడా నిధులు విడుదల చేయాలని కోరారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలి
గుంట భూమీ ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయం
రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24,5700 మంది ఉన్నారు
కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలి
నియోజకవర్గానికి 3500 ఇండ్లుకు లబ్ధిదారుల… pic.twitter.com/3kNfAG3FN3
— Telugu Galaxy (@Telugu_Galaxy) January 15, 2025