చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించాలంటే.. వీటిని లోపలికి పంపాల్సిందే..!

-

కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆహారంతో ప్రయోగాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. కొవ్వు పదార్ధాలు, బేకరీ ఆహారాలు, రెడ్ మీట్, వ్యాయామం లేకపోవడం, ధూమపానం మరియు అతిగా మద్యం సేవించడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి వీటన్నింటికీ దూరంగా ఉండి, హెల్తీ డైట్ పాటించడం వల్ల కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే.. అది తీవ్రమైన రోగాలకు దారితీస్తుంది. కొంచెం కొలెస్ట్రాల్‌ ఉండటం వల్ల ఏం కాదు.. కానీ అది క్రమంగా ఎక్కువైతే.. ముందు బరువు పెరుగుతారు, ఆ తర్వాత.. గుండె చుట్టూ చెడు కొలెస్ట్రాల్‌ ఒక కవచం నిర్మించుకుంటుంది.. పైప్‌లైన్‌లో ఏదైనా అడ్డుపడితే.. నీటి సరఫరా కష్టం అవుతుంది.. అచ్చం అలానే.. గుండెకు రక్తం సరఫరా చేసే ధమనుల్లో.. ఈ చెడు కొలెస్ట్రాల్‌ అడ్డుపడటంతో.. హార్ట్‌కు రక్తం సరిగ్గా అందదు.. గుండె పని.. వచ్చే రక్తాన్ని పంపింగ్‌ చేస్తూ.. కిందకు మీదకు తిప్పడం.. ఈ మార్గంలో.. ఈ చెడు కొలెస్ట్రాల్‌ ఉండటం వల్ల..

హార్ట్‌కు పని ఎక్కువ అవుతుంది..చాలా కష్టపడాల్సి వస్తుంది..అలాకొన్నాళ్లు.. గుండె అలిసిపోయి.. ఆగిపోతుంది.. సీన్‌ కట్‌ చేస్తే.. హార్ట్‌ ఎటాక్‌.. చెడు కొలెస్ట్రాల్‌ అనే శత్రువు ఎంత పని చేస్తుందో మీకు ఇప్పుడు క్లియర్‌గా అర్థమయిందా.. అందుకే ఇది రానే కూడదు.. ఒకవేళ బాడీలో ఈ చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే.. దాన్ని కరిగించాలి. ఒకటి వ్యాయామం ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించువచ్చు, రెండు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహారాలు ఏంటో తెలుసుకుని అవి తినాలి. పైప్‌లైన్ క్లియర్‌ అవుతుంది.. కాలువకు ఎలాంటి అడ్డం లేకపోతే. పొలానికి నీరు ఎంత స్పీడ్‌గా పారుతుందో..అలా మీ గుండె దాని పని అంత స్పీడ్‌గా చేసుకుంటుంది..

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి రెగ్యులర్‌గా తినాల్సిన మూడు ఆహారాలు…

వోట్స్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఓట్స్‌లో కాల్షియం, ప్రొటీన్, ఐరన్, జింక్, థయామిన్ మరియు విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు మరియు పీచుపదార్థాలు అధికంగా ఉండటం వల్ల ఓట్స్‌ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ ఉదయం ఓట్ మీల్ తినవచ్చు.

ఈ జాబితాలో అవోకాడో రెండవ స్థానంలో ఉంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గడానికి రోజుకు ఒక అవకాడో తినడం మంచిది.

జాబితాలో చివరిది నట్స్. విటమిన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన గింజలను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రక్తపోటును నియంత్రించవచ్చు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news