నేత్ర వైద్యుడు వెంకటస్వామికి డూడుల్‌తో గూగుల్ నివాళి

-

కంటి వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నేత్ర వైద్యుడు గోవిందప్ప వెంకటస్వామికి గూగుల్ డూడుల్‌తో నివాళులర్పించింది. ఆయన 100వ జయంతి సందర్భంగా డూడుల్‌ను ఏర్పాటు చేసింది. 1918 అక్టోబర్ 1న తమిళనాడులోని వడమాలపురంలో వెంకటస్వామి జన్మించారు. తన జీవితాన్నంతా ప్రజల్లో అంధకారాన్ని తరిమేయడం కోసమే కేటాయించారు. అతడిని అందరూ డాక్టర్ వీ అని పిలిచేవారు. అరవింద్ కంటి ఆసుపత్రిని స్థాపించిన వెంటకస్వామి.. కంటి సమస్యలతో బాధపడుతున్న చాలామందికి తక్కువ ఫీజుతో ఆపరేషన్లు చేసేవారు.

30 ఏళ్ల వయసులోనే వెంకటస్వామికి రూమటాయిడ్ ఆర్థరైటిస్ రావడం వల్ల కాళ్లు చేతులు వంకరపోయాయి. అయినప్పటికీ.. కంటి సమస్యలు ఎక్కువగా రావడానికి కారణమైన కాటరాక్ట్ సమస్యను ఎలా తొలగించాలో నేర్చుకున్నారు. రోజుకు 100 కాటరాక్ట్ సర్జరీలు చేసేవారు డాక్టర్ వీ. ఆయన తన డాక్టర్ వృత్తిలో భాగంగా లక్ష విజయవంతమైన ఆపరేషన్లు చేసి రికార్డు సృష్టించారు. 1973లో ఆయన్ను పద్మశ్రీ అవార్డు వరించింది. తన 87వ ఏట.. జులై 7, 2006 న వెంకటస్వామి మరణించారు. ఆయన ఈ లోకంలో లేనప్పటికీ.. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే ఆయన సేవలకు గాను గూగుల్ డూడుల్‌తో నివాళులర్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news