సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగర సంరక్షణ, అభివృద్ధికి ఉత్తమ పద్ధతులు అమలు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన సాగుతోంది. ఈ తరునంలోనే… తాజాగా సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. తాజాగా క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో భేటీ అయింది. హైదరాబాద్ లో రూ.450 కోట్ల పెట్టుబడికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. నగరంలో లక్ష చదరపు అడుగుల మేరకు భారీ ఐటీ పార్కు నిర్మించనుంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం బృందం ఎంవోయూ కుదుర్చుకుంది.
సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగర సంరక్షణ, అభివృద్ధికి ఉత్తమ పద్ధతులు అమలు చేయడమే లక్ష్యంగా సాగుతున్న సింగపూర్ పర్యటన pic.twitter.com/PhQ4KQylct
— BIG TV Breaking News (@bigtvtelugu) January 19, 2025