రాహుల్ ఆడితే పంత్ పరిస్థితి ఏంటీ…?

-

టీం ఇండియాలో కీపర్ స్థానం విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న టీం ఇండియాకు కీపర్ స్థానంలో సహా ఓపెనర్ కెఎల్ రాహుల్ పాత్రపై ఏ విధంగాను స్పష్టత అనేది రావడం లేదు. రాహుల్ లో ప్రతిభ ఉన్నా సరే అతనిని ఏ స్థానంలో దించాలి అనే దానిపై కెప్టెన్ కోహ్లీ మల్లగుల్లాలు పడుతున్నాడు అనేది వాస్తవం.

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సీరీస్ లో మూడు వన్డేల్లో మూడో స్థానాల్లో వచ్చాడు రాహుల్. మొదటి వన్డేలో మూడో స్థానంలో వచ్చిన ఈ కర్ణాటక బ్యాట్స్మెన్ రెండో వన్డేలో అయిదో స్థానంలో వచ్చి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా కీపర్ గా కూడా తన పాత్రను సమర్ధవంతంగా పోషించాడు. ఇక మూడో వన్డేలో ధావన్ అనూహ్యంగా గాయపడిన నేపధ్యంలో రాహుల్ కి అవకాశం వచ్చింది.

దానితో మళ్ళి ఓపెనర్ గా మారిపోయాడు ఈ కర్ణాటక యువ ఆటగాడు. శుక్రవారం నుంచి కివీస్ పర్యటన మొదలు కానుంది. ఈ నేపధ్యంలో ఈ పర్యటనలో రాహుల్ పాత్ర ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు. మరి రాహుల్ కి కీపింగ్ బాధ్యతలు అప్పగిస్తే యువ ఆటగాడు రిషబ్ పంత్ పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. కొంత కాలంగా పంత్ కి అవకాశాలు ఇస్తున్న ఫెయిల్ అవుతున్నాడు.

దీనితో అతని స్థానం విషయంలో స్పష్టత రావడం లేదు. పంత్ దూకుడు అయిన ఆటగాడు కావడంతో అతన్ని పరిస్థితులను బట్టి ఆడించాలి. రాహుల్ అలా కాదు. ఏ విధంగా అయినా సరే ఆడే సత్తా ఉన్న ఆటగాడు. దీనితో అతని విషయంలో కోహ్లీ ఎం చేస్తాడో చెప్పలేని పరిస్థితి. రాహుల్ ని కీపీంగ్ తీసుకోమంటే పంత్ ఎం చేస్తాడు అసలు టీంలో ఉంటాడా లేదా అనేది చెప్పలేని పరిస్థితి.

Read more RELATED
Recommended to you

Latest news