దావోస్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని వైసీపీ మాజీ మాజీ మంత్రి ఆర్కే కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. చంద్రబాబు ఖాళీ చేతులతో తిరిగి ఏపీ వచ్చారని ఎద్దేవా చేసారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ప్లాప్ అని పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తే.. చంద్రబాబు అండ్ కో కట్టుకథలతో ఏపీకి వచ్చిందని రోజా దుయ్యబట్టారు.
సీఎం చంద్రబాబు, లోకేష్ ల పాలనతో రాష్ట్రం ఇమేజ్ దెబ్బతిండుడంతో దావోస్ పర్యటనలో ఒక్కరూపాయి ఎంవొోయూ పెట్టుబడులు రాలేదని ఇది చాలా బాధకరమన్నారు. దావోస్ పర్యటనకు స్పెషల్ ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, షూట్లకు రూ.20 కోట్ల వరకు ఖర్చు అయిందని కనీసం ఆ ఖర్చుల వరకు అయినా పెట్టుబడులు దక్కలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలోనూ రూ.10లక్షల కోట్లు అప్పు ఉందని చంద్రబాబు అబద్దాలు చెప్పారని.. అబద్దాలు, కట్టుకథలు, పచ్చమీడియాతో ప్రజలను మభ్యపెట్టారని.. దావోస్ లోనూ అదే తరహాలో మభ్య పెట్టుబడిదారులు పారిపోయారని రోజా విమర్శించారు.