చెరువు గట్టు జాతరలో ఎస్సై దురుసు ప్రవర్తన.. మహిళపై చేయి చేసుకుని!

-

నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి వైభవంగా కొనసాగుతున్నాయి.ఇక అదే రోజు రాత్రి నుంచి స్వామి,అమ్మవార్ల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. దీంతో చెరువుగట్టు జాతరకు పెద్దఎత్తున భక్తులు విచ్చేస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చెరువుగట్టు జాతర చాలా ప్రసిద్ధి గాంచినది. ప్రతిఏటా అక్కడ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈక్రమంలోనే అక్కడకు విచ్చేసిన మహిళా భక్తులపై నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహిళను నెట్టేస్తూ ఆమె మీద చేయి చేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరో వీడియో తీసి నెట్టింట పోస్టు చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news