బాబును నమ్మటమంటే చంద్రముఖిని నిద్ర లేపటమే – జగన్‌

-

బాబును నమ్మటమంటే చంద్రముఖిని నిద్ర లేపటమే అంటూ సెటైర్లు పేల్చారు జగన్‌. చంద్రబాబు మోసం చేస్తాడని ఏపీ ప్రజలకు చెప్పానని.. కానీ ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారన్నారు. దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ ను మించిపోయి చంద్రబాబు నటిస్తున్నాడని ఆగ్రహించారు జగన్‌. ఇవాళ ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన జగన్‌… మాట్లాడుతూ… చీటింగ్ లో పీహెచ్డీ చేసిన బాబు..రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అంటాడన్నారు.

YS Jagan’s key comments on the resignation of Mopidevi at the meeting of YCP leaders in Raypally

భయం వేస్తుంది అని అంటాడని చురకలు అంటించారు. వెటకారంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. హామీలు అమలు చేయాలని అడిగితే.. సంపాదించే మార్గాలు ఉంటే చంద్రబాబు నా చెవిలో చెప్పాలని వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లలకు చదువులను ప్రోత్సహిస్తూ తల్లులకు ఇచ్చిన అమ్మఒడి పోయే.. వసతి దీవెన పోయే.. మిగతా ఇస్తున్న పథకాలు అరకొరే అంటూ ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news