డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచేటట్టుంటే కేసీఆర్ 100 గెలిచే వాడు : సీఎం రేవంత్ రెడ్డి

-

డబ్బులు గెలిపిస్తాయనుకుంటే కేసీఆర్ కు 100 సీట్లు వచ్చేవని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గాంధీ భవన్ లో ఇవాళ జక్కిడి శివచరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాకు పాలనే సరిపోతుంది.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ నేతలదే అన్నారు. కాంగ్రెస్ నేతల్లో ఎవ్వరూ డబ్బులు ఖర్చు చేసి గెలవలేదని.. అందరూ ప్రజాభిమానంతోనే గెలిచారని తెలిపారు.

మొన్న ఆయన బయటకొచ్చి కొడితే గట్టిగా కొడతానని అంటున్నారు. కేసీఆర్ కి అంతగా కొట్టాలనిపిస్తే ఫుల్ కొట్టు, హాఫ్ కొట్టు అన్నారు. అలాగే ముందు మీ కొడుకు కేటీఆర్ ను కొట్టు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. బిడ్డ కవితను కొట్టు లిక్కర్ స్కామ్ లో పాల్పడినందుకు.. మీ అల్లుడు హరీశ్ ను కొట్టు.. మీ సడ్డకుని కొడుకును కొట్టు అన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ను కవిత ఓడించింది. మీ కుటుంబ సభ్యుల అవినీతి, అక్రమాలు చూసే ప్రజలు బీఆర్ఎస్ ను బండకేసి కొట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news