ఎంతో చేయాలని ఉంది.. కానీ గల్లా పెట్టే సహకరించడం లేదు : సీఎం చంద్రబాబు

-

అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఎన్నో పథకాలను అమలు చేసామని సీఎం చంద్రబాబు చెప్పారు. పింఛన్లు పెంపు, మహిళలకు ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేసారు. గత ప్రభుత్వంలో సంపద పెరగలేదని.. రూ.10లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇంకా ఎంతో చేయాలని ఉందని.. కానీ గల్లా పెట్టే సహకరించడం లేదన్నారు.

రూ.55కోట్ల విలువ చేసే 1650 కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులు, కమ్యూనిటీ పబ్లిక్ టాయిటెట్లు మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో భారీగా చెత్త పేరుకుపోయిందని.. ఇందులో 36లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని, అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు చెత్త లేకుండా క్లీన్ చేయించాలని మంత్రి నారాయణ కు టార్గెట్ ఇచ్చానని తెలిపారు. ప్రతీ నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కోసం పని చేయాలని చెప్పామని.. ఈ రోజు కందుకూరుకు అందుకే వచ్చానని ఒక్కరోజు మన ఊరు శుభ్రంగా ఉంచడానికి పని చేస్తే.. పరిసరాలు శుభ్రంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news