YCPకి ప్రతిపక్ష హోదా రాదు : డిప్యూటీ పవన్ సంచలనం

-

వైసీపీ పార్టీ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 సీట్లు ఉన్న వైసిపి కి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు అంటూ నిలదీశారు. అసలు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదన్నారు. గవర్నర్ ప్రసంగం ఎలా అడ్డుకుంటారని… ప్రజల తీర్పు గౌరవించండని ఫైర్ అయ్యారు. వైసిపి స్థాయికి. తగ్గట్టు అసెంబ్లీ లో అవకాశాలు ఉంటాయని తెలిపారు. స్పీకర్ కూడా చాలా గౌరవంగా సమయం ఇచ్చారని… వైసిపి ని ఎట్టి పరిస్థితి లో ఇబ్బంది పెట్టలేదని వివరించారు.

pawan kalyan warn jagan

వైసిపి హుందాగా ఉండాలని కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైసీపీకి 11 సీట్లే వచ్చినా స్పీకర్ ఇన్ని రోజులు వాళ్లకు సరైన గౌరవం ఇచ్చారని చురకలు అంటించారు పవన్ కళ్యాణ్. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రండి అంటూ మండిపడ్డారు.వైసీపీ నాయకులు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం, బాధ్యత ఉందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news