నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి పోలీసుల విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు (), పవన్ కల్యాణ్, నారా లోకేశ్ దూషించిన కేసులో బుధవారం హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి కి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆయనను ఉదయం నుంచి పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం కోర్టుకు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పోసాని తరపున లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.
ఓబులవారిపల్లి నుంచి పొన్నవోలు మాట్లాడుతూ వైఎస్ జగన్ ను, ఆయన కుటుంబాన్ని దూషించినప్పుడు కూటమి నేతలకు కనబడలేదా? అని ప్రశ్నించారు. వైసీపీ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలబడుతుందని చెప్పారు. ఈ కేసులో పోసానికి బెయిల్ రావాలనే కోరుకుంటున్నానన్నారు. పోసానిని తాను ఇంకా ప్రత్యక్షంగా కలవలేదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. పోసాని తరపున వాదనలు వినిపించాలని జగన్ ఆదేశించారని తెలిపారు. కార్యకర్తలకు, పార్టీ నేతలకు ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం కోసం వాదనలు వినిపించాలని జగన్ సూచించారని చెప్పారు.