ఆయుర్వేదంలో తులసి ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పైగా దీనిని ఎన్నో ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. చాలా శాతం మంది బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే తులసిను ఉపయోగించడం వలన బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుందని ఎన్నో పరిశోధనలు కూడా చెబుతున్నాయి. వీటిలో ఉండే ఔషధ గుణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి మరియు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
భారతదేశంలో హిందువులు అందరూ తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. కేవలం పూజించడానికి మాత్రమే కాకుండా దీనిలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు, దగ్గు మరియు జలుబు వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. తులసిని ఉపయోగించి జీవక్రియను కూడా పెంచవచ్చు. అదేవిధంగా పొట్ట చుట్టూ ఉండేటువంటి కొవ్వును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
ఈ విధంగా బరువుని తగ్గవచ్చు. ఎప్పుడైతే తులసి ఆకులను ప్రతిరోజు తీసుకుంటారో ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి సహాయం చేస్తుంది మరియు క్యాలరీలు కూడా ఎంతో త్వరగా ఖర్చు అవుతాయి. దీంతో ఎంతో సులువుగా బరువును తగ్గవచ్చు. కాకపోతే ప్రతిరోజు తగిన మోతాదులో తీసుకోవడం వలన బరువు తగ్గవచ్చు. చాలా శాతం మంది ఎక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు మరియు ఆకలి కూడా ఎక్కువ ఉండటం వలన అతిగా తింటూ ఉంటారు. అలాంటివారికి ఆకలిని తగ్గించుకోవడానికి మరియు తక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి తులసి సహాయం చేస్తుంది. దాంతో తక్కువ శాతం ఆహారాన్ని తీసుకుంటారు శరీర బరువును కూడా పెరగకుండా ఉంటారు.