వైరల్ వీడియో; ఆ మొసలి మెడలో టైర్ తీస్తే కోట్ల రూపాయలు బహుమతి…!

-

ఇండోనేషియా అధికారులు ఒక మొసలి కోసం భారీ ఆఫర్ ఇచ్చారు. మోటారు బైక్ టైర్లో మెడ చిక్కుకున్న ఉప్పునీటి మొసలి కోసం ఇండోనేషియా అధికారులు సహాయం కోరుతూ ఇచ్చిన పిలుపు ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ మొసలిని ఎవరైనా రక్షిస్తే తాము బహుమతి ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఒక వార్తా సంస్థ నివేదిక ప్రకారం 13 అడుగుల మొసలిని కాపాడటానికి తీవ్రంగా చాలా ఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

కాని అది నిరంతరం ఫెయిల్ అవుతూనే ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది. ఆ టైర్ ఆ మొసలిని చంపుతుంది ఏమో అనే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతుంది. అయితే దీని కోసం కొందరు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో అధికారులు కొన్ని హెచ్చరికలు చేసారు. బహుమతి ప్రకటించిన తర్వాత ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో… దాని నివాసానికి ఆటంకం కలిగించవద్దని కోరారు.

ఆ టైర్ మొసలి మెడలో నుంచి తీస్తే భారీగా నగదు ఇస్తామని కూడా అధికారులు ప్రకటించారు. దీనిపై జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. దీనిపై స్పందించిన సెంట్రల్ సులవేసి సహజ వనరుల పరిరక్షణ సంస్థ అధిపతి హస్ముని హస్మార్, “మొసలికి దగ్గరగా ఉండవద్దని లేదా దాని నివాసానికి భంగం కలిగించవద్దని మేము సాధారణ ప్రజలను కోరుతున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news