దేశ రాజధాని ఢిల్లీని ఇప్పుడు కాల్పులు భయపెడుతున్నాయి. వరుసగా జరుగుతున్న కాల్పులు అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో పౌరసత్వ సవరణ చట్టం కి సంబంధించిన ఆందోళనలు జరుగుతున్నాయి. అలాహే జామియా విశ్వ విద్యాలయం దగ్గర కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో కూడా కాల్పులు జరుగుతున్నాయి.
తుపాకి పట్టుకుని వస్తున్న వ్యక్తులు నిరసన కారులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగుతున్నారు. దీనితో అక్కడి నిరసనకారులతో పాటు ప్రజలు కూడా భయపడుతున్నారు. తాజాగా ఆదివారం అర్ధ రాత్రి కూడా కాల్పులు జరిగాయి. దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది అర్ధం కావడం లేదు. త్వరలో ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల నేపధ్య౦లో ఇప్పుడు అక్కడ జరుగుతున్న కాల్పులు భయపెడుతున్నాయి.
ఇక దీని వెనుక బిజెపి ఉందని ఆప్ ఆరోపిస్తుంది. ఢిల్లీ పోలీసులు కూడా బిజెపికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇటీవల బిజెపి నేతలు కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యల తర్వాతే ఈ కాల్పులు జరిగాయి. నాలుగు రోజుల క్రితం జరిగిన కాల్పుల సమయంలో పోలీసులు అలా నిలబడి చూస్తూనే ఉండిపోయారు. కాని ఆ వ్యక్తిని ఆపలేదు.
దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఇప్పుడు అక్కడ ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే దీని వెనుక బిజెపి ఉందనే ఆరోపణలే బలంగా వినపడుతున్నాయి. సర్వేల ఫలితాలు అన్నీ కూడా బిజెపికి వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకే ఈ విధంగా బిజెపి కొందరిని రెచ్చగోడుతుందని, హిందుత్వ సంస్థలతో ఢిల్లీలో ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వామపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి.