గాంధీ జ‌యంతి రోజుకూడా చంద్రబాబు అబద్ధాలు : పెద్దిరెడ్డి

-

peddireddy ramachandra reddy fires chandrababu naidu
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి రోజు కూడా పచ్చి అబద్ధాలు చెప్పారని వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతికి ఆంక్షలు పెట్టి నిరుద్యోగులను మోసగిస్తున్నారని విమర్శించారు. కోటికిపైగా నిరుద్యోగులు ఉంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తారా అని ప్రశ్నించారు. లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 20 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇస్తారా అని ప్రశ్నించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. సీపీఎస్ రద్దు కోసం ఉపాధ్యాయులు పోరాడుతూ వైఎస్‌ జగన్‌ని కలిస్తే వారిని సస్పెండ్‌ చేసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. తమ పార్టీ యువ నాయకుడు వంగవీటి రాధాకి పార్టీలో పూర్తి ప్రాధాన్యత ఉందని, ఆయన మా పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news