హైదరాబాద్‌కి రాహుల్‌.. లింగంపల్లి, నాంపల్లిల్లో భారీ బహిరంగ సభ

-

rahul gandhi Hyderabad two day tour
ఈ నెల 13న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కి రానున్నారు.షెడ్యూల్‌ ప్రకారం 13వ తేదీ మధ్యాహ్నం వరకు రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి 5000 బైక్‌లతో కార్యకర్తలు ర్యాలీగా స్వాగతం పలికేలా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ప్లాన్‌ చేశారు.అనంతరం రాజేంద్రనగర్‌లోని క్లాసిక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని స్వయం సహాయక గ్రూపు సభ్యులతో మాట్లాడతారు. సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు శేరిలింగంపల్లి జరిగే బహిరంగ సభలో ప్రసగిస్తారు. 8 నుంచి 9.30 గంటల వరకు నాంపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 10 నుంచి 11 గంటల వరకు ముస్లిం మేధావులతో సమావేశం ఉంటుంది.

రాహుల్‌ గాంధీ 14వ తేదీ రోజు షెడ్యూల్‌

ఉదయం తొమ్మిదిన్నరకు పెద్దమ్మ గుడిని దర్శించుకుంటారు.
10 నుంచి 11 గంటల మధ్య జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ నాయకులతో సమావేశం ఉంటుంది.
11 నుంచి 12 గంటల మధ్య వ్యాపారవేత్తలతో సమావేశం
12 నుంచి 12.30 గంటల మధ్య ప్రెస్‌క్లబ్‌లో ఎడిటర్లతో సమావేశం
మధ్యాహ్నం 1 నుంచి 1.30 వరకు ప్యారడైజ్‌ రెస్టారెంట్‌లో భోజనం చేస్తారు.
2 నుంచి 3 గంటల మధ్య ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తారు.
3.30 నుంచి 4.30 గంటల మధ్య సికింద్రాబాద్‌లో పబ్లిక్‌ మీటింగ్‌లోని పాల్గొని ప్రసంగిస్తారు.
సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య సనత్‌నగర్‌లో సమావేశం
6 నుంచి 7.30 గంటల మధ్యలో గోషామహల్‌లో సమావేశం
8 నుంచి 9 గంటల మధ్యలో కులీకుతుబ్‌ షా స్టేడియంలో మీటింగ్‌
9 నుంచి 9.30 వరకు పాతబస్తీలోని మదీనా హోటల్లో రాత్రి భోజనం
రాత్రి 10.30 గంటలకు తిరిగి ఢిల్లీ పయనం

Read more RELATED
Recommended to you

Latest news