పెన్షన్ విషయంలో జగన్ కీలక నిర్ణయం…!

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పెన్షన్లు తొలగించడంపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతుంది. తమ వారికి పెన్షన్ ఇవ్వడం కోసం మిగిలిన వారి పెన్షన్ రద్దు చేసింది ప్రభుత్వం అంటూ విపక్ష టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆందోళనలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వారికి అందరికి పెన్షన్లు ఇవ్వాలని భావిస్తుంది.

ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతీసుకున్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హత ఉన్నా పెన్షన్‌ రాలేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని ఆదేశించారు. పెన్షన్లపై వెరిఫికేషన్‌ చేశాక అర్హత ఉందని తేలితే… వారికి రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్‌ ఇస్తామని అన్నారు.

అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే, ఐదు రోజుల్లో పెన్షన్‌కార్డు ఇస్తామని స్పష్టం చేసారు. రాష్ట్రంలో కొత్తగా 6,14,244 మందికి పెన్షన్లు ఇచ్చామన్నారు. అయినా పథకం అందలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయన్న జగన్, పెన్షన్‌ దరఖాస్తులను ఫిబ్రవరి 17 నాటికి కలెక్టర్లు రీ వెరిఫికేషన్‌ చేయాలన్నారు. 18కల్లా అప్‌లోడ్‌ చేసి, 19, 20 తేదీల్లో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించాలని, తుది జాబితాను 20న ప్రకటించాలని ఆదేశించారు. మార్చి 1న కార్డుతో పాటు, పెన్షన్‌ ఇవ్వాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news