అతను అడుగు పెడితే ఎవరైనా గెలవాల్సిందేనా…?

-

ప్రశాంత్ కిషోర్’ 2017 నుంచి ఆంధ్రప్రదేశ్ లో వినపడే పేరు. దేశ రాజకీయాల మీద అవగాహన ఉన్న అందరికి ఈ పేరు బాగా తెలిసే ఉంటుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త దేశం మొత్తం ఈయన రాజకీయ పార్టీలకు సేవలు అందించారు. 2014 లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ప్రశాంత్ కిషోర్ ప్రధాన కారణం. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అస్థిరమైన పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళారు ప్రశాంత్ కిషోర్.

ఆ తర్వాత బీహార్ లో జేడియుకి పని చేసారు ప్రశాంత్ కిషోర్. భిన్న ధృవాలుగా ఉన్న జేడియు, ఆర్జెడి కలిపి అధికారంలో కూర్చోబెట్టారు ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత షా వ్యూహంతో ప్రభుత్వం కూలిపోయింది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్, ఎస్పీ పార్టీలకు పని చేసినా బిజెపి హవా ముందు నిలవలేదు. అయితే పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి పని చేసి తన వ్యూహాలతో జగన్ ని ముందుకి నడిపించారు. ప్రసంగాలను కూడా ఆయన ప్రభావితం చేసారు. నవరత్నాలు అనే ఆలోచన ఆయనదే అంటూ ఉంటారు. ఇప్పుడు ఆప్ కి ఆయన పని చేసారు. రెండు నెలల నుంచి బిజెపిని టార్గెట్ చేస్తూ వస్తున్న ఆయన, సొంత పార్టీని కూడా కాదన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్ ని జేడియులో నెంబర్ 2 చేసారు.

అయినా సరే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో తీవ్రంగా విభేదించడంతో పార్టీ నుంచి ఆయన సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఆప్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆప్ ఘన విజయం వెనుక కేజ్రివాల్ పాలనతో పాటుగా ఆయన సహకారం కూడా ఉందీ. ఇక ఇప్పుడు బీహార్ మీద ఆయన దృష్టి పెడుతున్నారు. బీహార్ లో ఆప్ ని రంగంలోకి దించే ఆలోచన చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్.

బిజెపి, జేడియు కూటమిని అధికారం నుంచి దించడానికి, గానూ ఆర్జెడి, కాంగ్రెస్, ఆప్ ని మూడు కలిపి రంగంలోకి దించే విధంగా వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ మీద ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ మమతకు పని చేస్తున్నారు. బిజెపి అంటే మమత ఒంటి కాలు మీద లేస్తున్నారు. కాబట్టి బీహార్ ఎన్నికల తర్వాత అక్కడ ఆమెను గెలిపించే విధంగా అడుగులు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news