నేడు ఏపీ కేబినెట్ భేటీ.. చ‌ర్చించే ముఖ్య అంశాలివే..!

-

నేటి ఉద‌యం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి టెన్త్ విద్యార్థుల వరకు జగనన్న విద్యాకానుక కింద స్కూల్ బ్యాగులు ఇవ్వాలన్న ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. 3 జతల యూనిఫాం, 2 జతల షూ, పుస్తకాలు ఇచ్చే అంశంపై కేబినెట్‌లో చర్చించనున్నారు. సీపీఎస్ ర్యాలీలపై నమోదైన కేసుల రద్దుపై కేబినెట్‌లో నేతలు ప్రస్తావించనున్నారు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుపై మంత్రి వర్గ భేటీలో చర్చ జరుగనుంది. అలాగే ఎర్రచందనం కేసుల విచారణకు తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదన చేయనున్నారు.

మ‌రియు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 27 రోజుల నుంచి 20 రోజులకు కుదించే ప్రతిపాదనలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ముసాయిదా బిల్లు ఆమోదంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక బుధవారం ఉదయం పదిన్నరకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పూర్తి అయ్యాక సీఎం వైఎస్‌ జగన్‌ సచివాలయం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడినుంచి ఢిల్లీకి బయల్దేరి వెళతారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రధానితో సమావేశమవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news