ఏపీ గవర్నమెంట్ కి అద్భుతంగా చెక్ పెట్టిన ఏబి వెంకటేశ్వరరావు..! 

-

ఇటీవల జగన్ సర్కార్ చంద్రబాబు హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్ ఆఫీసర్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు నీ సస్పెండ్ చేయడం జరిగింది. విచారణ పేరిట గత ఏడాది మే మాసం నుండి జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్న తరుణంలో ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు హయాంలో భారీ అవినీతికి ఏబీ వెంకటేశ్వరరావు పాల్పడటం జరిగిందని జగన్ సర్కార్ ఆరోపిస్తూ ఏబీ వెంకటేశ్వరరావు పై విచారణ స్టార్ట్ చేశారు. దీంతో గత కొంత కాలం నుండి విధులకు దూరంగా ఉంచుతూ ఇటీవల ఆయుధ పరికరాలకు సంబంధించిన కొనుగోలు విషయంలో దేశ ద్రోహానికి పాల్పడే  విధంగా ఏబీ చంద్రబాబు హయాంలో అవినీతికి తెగబడ్డారు అని విచారణలో తేలిందని జగన్ సర్కార్ సస్పెండ్ చేయడం జరిగింది.

Image result for ab venkateswara rao

దీంతో తనపై జగన్ సర్కార్ విధించిన సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్(సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యూనల్)ను ఆశ్రయించారు. చట్టవిరుద్ధంగా తనను సస్పెండ్ చేశారని తన పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి మే 31 నుండి తనకు ఎటువంటి జీతభత్యాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ కి తెలిపారు. నాపై ఆరోపిస్తున్న అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదని కేవలం రాజకీయ కక్షతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తన సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలని క్యాట్ ని ఏబి వెంకటేశ్వరరావు కోరడం జరిగింది. 

 

ఈ పరిణామంతో ఏబీ వెంకటేశ్వరరావు పై జగన్ సర్కార్ విధించిన సస్పెన్షన్ వేటు పై స్టే వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని రాజకీయ మేధావులు అంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే జగన్ సర్కార్ వెంకటేశ్వరరావుని ఇబ్బందులకు గురి చేసిందని జరుగుతున్న ప్రాసెస్ బట్టి  క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇటువంటి టైం లో వెంకటేశ్వరరావు క్యాట్ నీ ఆశ్రయించటం ఏపీ గవర్నమెంట్ కి చెక్ పెట్టినట్లే అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news