బన్నీకి అదరగొట్టాడు, మరి పవన్ కి ఎలా ఇస్తాడో….??

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అలవైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి హిట్ తో పాటు బాగా కలెక్షన్ ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని థమన్ అందించిన సాంగ్స్ ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాములా సాంగ్స్ అయితే 100 మిలియన్లకు పైగా వ్యూస్ ని అందుకుని యూట్యూబ్ లో అతి పెద్ద రికార్డుని సృష్టించడం జరిగింది.

ఇక సిద్ శ్రీరామ్ ఆలపించిన సామజవరగమనా సాంగ్ కు అయితే యువత విపరీతంగా అట్ట్రాక్ట్ అయ్యారు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా తరువాత ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పింక్ అధికారిక తెలుగు రీమేక్ కు కూడా ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి నిన్న సాయంత్రం థమన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక అప్ డేట్ ని ఇచ్చాడు. తనతో కలిసి సిద్ శ్రీరామ్ దిగిన ఒక ఫోటోని షేర్ చేసిన థమన్,

 

మా ఇద్దరి ఈ లేటెస్ట్ కలయిక ఏ సినిమా కోసమో చెప్పుకోండి అంటూ థమన్ అడగడంతో మెజారిటీ నెటిజన్లు, పవన్ సినిమా కోసం అంటూ కామెంట్స్ చేసారు. ఇక కాసేపటి తరువాత ఎస్ మీరు చెప్పింది నిజం, పవర్ స్టార్ తో నేను చేస్తున్న పింక్ రీమేక్ లో శ్రీరామ్ ఒక సాంగ్ ని ఆలపిస్తున్నాడు అని చెప్పాడు. దీనితో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే అలలో సామజవరగమనా రేంజ్ లో ఈ సాంగ్ ని థమన్ అందిస్తాడో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే….!!

Read more RELATED
Recommended to you

Latest news